అనంతపురం జిల్లా తాడిపత్రి గన్నేవారిపల్లిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనతోనేఅన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.తెదేపా అధికారంలోనే అందరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ,సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాబోయో ఎన్నికల్లో తనకుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తాడనితెలిపారు. ఇదే నమ్మకంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు ప్రసాద్ నాయుడు, రాము, రవి, భాస్కర్, అన్సార్, తదితరులు పాల్గొన్నారు.