భాజపాలో చేరేందుకు వైకాపా నేతలు ఆసక్తి కనబరుస్తున్నారన్న సుజనా చౌదరి వ్యాఖ్యలపై... ఆ పార్టీ ఎంపీలు మండిపడ్డారు. కనీసం ఒక్కరి పేరైనా చెప్పాలని... అప్పుడు ఎలాంటి స్పందన వస్తుందో తెలుస్తుందన్నారు. సుజనాచౌదరి అసలు ఏ పార్టీనో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తమకు టికెట్ ఇచ్చి ఎంపీని చేసిన సీఎం జగన్‌కు... ఎప్పటికీ విధేయులుగా ఉంటామని ఎంపీలు అన్నారు. సుజనాచౌదరిపై విమర్శల దాడి చేశారు. పేదలకు ఆంగ్ల విద్య దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ను మళ్లీ జైలుకు పంపించాలని సుజనాచౌదరి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి