ETV Bharat / city

కేంద్రం రూ.116 లక్షల కోట్ల అప్పు చేసింది

కేంద్ర ప్రభుత్వం రూ.116 లక్షల కోట్ల అప్పులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలోనే రూ.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, కేంద్రం ముందు ఏపీ చేసిన అప్పు ఎంత? అని ప్రశ్నించారు.

sajjala
sajjala
author img

By

Published : Aug 9, 2021, 8:13 AM IST

కేంద్ర ప్రభుత్వం రూ.116 లక్షల కోట్ల అప్పులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలోనే రూ.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, కేంద్రం ముందు ఏపీ చేసిన అప్పు ఎంత? అని ప్రశ్నించారు. భాజపా నేతలు మతం, ఆర్థిక అంశాల ప్రాతిపదికన ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా దుష్ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతోందని ధ్వజమెత్తారు.

‘సీఎం జగన్‌ లాంటి బలమైన నేతను దెబ్బతీయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయన కుటుంబం అనుసరించే విశ్వాసాన్ని భాజపా నేతలు బలహీనతగా భావిస్తున్నారు. అది బలహీనత కాదు’ అని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సజ్జల మాట్లాడారు. ‘భాజపా.. మతాన్ని రెచ్చగొడుతూ బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులను ప్రభావితం చేసేలా ప్రమాదకర దుష్ప్రచారం సాగిస్తోంది.

తెదేపా-భాజపా భాగస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పుడు పలు ఆలయాలను కూల్చినా భాజపా నేతలు కిమ్మనలేదు. ఇప్పుడు చిన్నపాటి ఘటనలు జరిగినా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అప్పులు చేస్తున్నా వాటిని ప్రజలకు మేలుచేసే పథకాలకు పారదర్శకంగా అందిస్తోంది. ఆర్యవైశ్యుల్లోని పేదలను ఆదుకునేందుకు కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుంటే దానికి మ్యాచింగ్‌ గ్రాంటుగా ప్రభుత్వం నుంచి మరికొంత ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా’ అని తెలిపారు. మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, అన్నా రాంబాబు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'సర్కారు వారి పాట' బ్లాస్టర్.. మహేశ్ లుక్స్ అదుర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.