ETV Bharat / city

'తెలంగాణలో వయసు పరిమితి లేకుండా రైతు బీమా అమలు చేయాలి' - ap latest news

YS Sharmila On Farmers Suicides: రైతులను సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు.. ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకూ రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila On Farmers Suicides
YS Sharmila On Farmers Suicides
author img

By

Published : Jan 27, 2022, 3:42 PM IST

YS Sharmila On Farmers Suicides: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్​ పట్టించుకోవటం లేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో వయసు పరిమితి లేకుండా రైతు బీమా పథకం అమలు‌ చేయాలని డిమాండ్​ చేశారు. కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నామని.. ఆయన స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

రుణ మాఫీ చేస్తానని తెలంగాణలో సీఎం కేసీఆర్​ చెప్పి ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకూ కేవలం రూ. 25,000 లోపు రుణం ఉన్న 3 లక్షల మందికే రుణ మాఫీ చేశారు. మిగిలిన వారిని పట్టించుకోలేదు. దీంతో బ్యాంకుల్లో అప్పు పుట్టక.. రైతులు బయట అధిక వడ్డీలకు తెస్తున్నారు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కేసీఆర్​ స్పందించడం లేదు. మరో వైపు రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉంటే.. 41.50 లక్షల మందికే ప్రీమియం చెల్లిస్తున్నారు. 59 ఏళ్ల లోపు ఉన్నవారికే బీమా చేస్తామని కేసీఆర్​ చెప్పడం బాధాకరం. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌలు రైతు చనిపోతే బీమా ఎందుకు ఇవ్వరు.? ఓ రకంగా రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం. - షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

అప్పుడే పాదయాత్ర

బుధవారం ఒక్కరోజే ఐదుగురు రైతులు చనిపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 66 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 41.50 లక్షల మందికే ప్రీమియం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. 59 ఏళ్ల లోపు ఉన్న రైతులు చనిపోతే బీమా వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడం బాధాకరమని.. కౌలు రైతులు చనిపోతే బీమా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్​ కారణమని దుయ్యబట్టారు. కొవిడ్​ తీవ్రత తగ్గుముఖం పట్టగానే పాదయాత్ర మొదలుపెడతామని ప్రకటించారు.

'తెలంగాణలో వయసు పరిమితి లేకుండా రైతు బీమా అమలు చేయాలి'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: TDP LEADERS MEET GOVERNOR: 'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.