ETV Bharat / city

sexual harassment: బాబాయి అత్యాచారం.. సోదరుడి లైంగిక వేధింపులు.. యువతి బలవన్మరణం - యువతిపై చిన్నాన్న లైంగిక వేధింపులు

తల్లిదండ్రులు చనిపోవడంతో... పెదనాన్న, పెద్దమ్మలు ఆమెను పెంచి పోషించారు. కానీ సొంత చిన్నాన్న, పెద్ద నాన్న కుమారులే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. భరించలేని ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

sexual harassment
sexual harassment
author img

By

Published : Aug 17, 2021, 7:55 AM IST

రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. ఆమెను పెదనాన్న, పెద్దమ్మ పెంచి పెద్ద చేశారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే వావివరుసలు మరిచారు. సొంత చిన్నాన్న, పెదనాన్న కొడుకు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో సోమవారం వెలుగుచూసింది.

కూలీ పనులకు పంపుతూ... వేధింపులు

నేరేడుచర్ల ఎస్సై విజయ్‌ప్రకాశ్‌, మృతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫత్తేపురానికి చెందిన ఓ యువతి(21)కి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు మరణించారు. వారికి ఇద్దరు కూతుళ్లు కాగా.. ఒకరిని పెదనాన్న, పెద్దమ్మలు పెంచి పెద్ద చేశారు. మరొకరిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. వారు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. పెద్దమ్మ, పెదనాన్నల వద్ద ఉన్న యువతిని పదో తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇంటి పనులు, కూలి పనులు చేయిస్తూ వేధించారు.

సొంత చిన్నాన్నే గర్భవతిని చేశాడు..

సొంత చిన్నాన్న ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చగా.. గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత పెదనాన్న కుమారుడు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీన్ని తాళలేక ఆమె శనివారం పురుగుల మందు తాగింది. తొలుత మిర్యాలగూడకు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా.. హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. తన సోదరిని లైంగికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి సోదరి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Murder: గొడ్డలితో దారుణంగా నరికేశారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.