తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూర్ చెందిన వాకిటి బస్వరాజ్... రెండు చేతులతో అతి సునాయసంగా ఒకే పదాన్ని నాలుగు భాషల్లో రివర్స్‌గా రాసి అబ్బురపరుస్తున్నాడు. అంబులెన్స్‌పై రివర్స్‌గా రాసి ఉండటం చూసి ఎందుకు ప్రయత్నించకూడదని మొదలుపెట్టాడు.
ప్రశంసలు...
ఈ ప్రయత్నంలో భాగంగానే ఒకే పదాన్ని నాలుగు భాషల్లో ఒకటి సరిగా మరోటి రివర్స్‌గా రాయడం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఎవరు రాయడం లేదని తెలుసుకున్న బస్వరాజ్... ఏషియా రికార్డుతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు సైతం పంపించాడు. వారు చేతిరాత ప్రతిభను గుర్తించి ఆన్‌లైన్‌లో ప్రశంసాపత్రాలు అందజేశారు.
గిన్నిస్ లక్ష్యం...
బస్వరాజ్ కర్ణాటకలోని దేవాసుగుర్ థర్మల్ ప్లాంటులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని చేతిరాత ప్రతిభను స్నేహితులు ప్రశంసిస్తున్నారు. చేతి రాత ప్రత్యేకత ద్వారా ఎప్పటికైనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాలనేది లక్ష్యమని.. బస్వరాజ్ చెబుతున్నాడు.
ఇదీ చూడండి: కాసేపట్లో.. వైకాపా ఎంపీలతో సీఎం జగన్ భేటీ