ETV Bharat / city

'బండి సంజయన్న​పై చెయ్యేస్తే సహించేది లేదు' - suicide attempted to suicide for bandi sanjay

తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టును నిరసిస్తూ... ఓ యువకుడు హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా... అక్కడే ఉన్న స్థానికులు మంటలార్పి కాపాడారు.

ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
author img

By

Published : Nov 1, 2020, 3:50 PM IST

దుబ్బాకలో జరిగిన తనిఖీల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు నాంపల్లిలోని భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన శ్రీను... ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. బండి సంజయ్​పై చేయి వేస్తే సహించేది లేదని యువకుడు హెచ్చరించాడు. ఘటన జరిగిన సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని అందుకే ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేశానని తెలిపాడు. పోలీసులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: ప్రధానికి లేఖ రాసి సీఎం జగన్ చులకనయ్యారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.