సీఎం జగన్ అధ్యక్షతన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. వైకాపా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిచనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు.
పోలవరం (polavaram) ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం (water disputes), రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల పుర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల అంశాలను ప్రస్తావించే అంశంపై ఎజెండా ఖరారు చేయనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల, కొవిడ్ దృష్ట్యా అదనంగా ఆర్థిక సాయం, రుణ పరిమితి తగ్గింపు అంశం, ప్రత్యేక హోదా సహా తదితర అంశాల ప్రస్తావన సహా పోరాటం చేసే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: