కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైకాపా ఎంపీలు దిల్లీలో కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంలో సీఎం జగన్ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై అమిత్‌షాకు తెలిపినట్లు పేర్కొన్నారు.
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరినట్లు ఎంపీలు వివరించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వీటికి హోంమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని అమిత్‌షాను కోరినట్లు ఎంపీ సత్యనారాయణ చెప్పారు.
ప్రత్యేక గనులు లేకపోవడంతో పాటు సంస్థపై రుణభారమే నష్టాలకు కారణమని ఆయనకు వివరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే పరిష్కార మార్గాలను చూడాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. దిశ చట్టం దేశవ్యాప్తంగా ఉపయోగపడే చట్టమని.. దానిని ఆమోదించాలని మంత్రిని కోరినట్లు ఎంపీ వంగా గీత తెలిపారు.
ఇదీ చదవండి: