ETV Bharat / city

'శాసనసభ రూల్స్​కు వ్యతిరేకంగా నోటీసులివ్వడం దారుణం' - ఎస్ఈసీపై మోపిదేవి కామెంట్స్

గుంటూరుజిల్లా రేపల్లె పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ మోపిదేవి శ్రీకారం చుట్టారు. శాసనసభ రూల్స్​కు వ్యతిరేకంగా మంత్రులకు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు.

YCP MP Mopidevi
ఎంపీ మోపిదేవి
author img

By

Published : Feb 3, 2021, 5:51 PM IST

చంద్రబాబు డైరెక్షన్​లోనే పట్టాభిపై దాడి జరిగిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో పర్యటించిన మోపిదేవి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ప్రభుత్వ స్థలాల్లో ప్రజా ఉపయోగకరమైన కాంప్లెక్స్​లను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన మంత్రులపై కూడా పూర్తి అధికారం ఉందంటూ ఎస్ఈసీ దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. శాసనసభ రూల్స్​కు వ్యతిరేకంగా మంత్రులకు నోటీసులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. చట్టాలకు లోబడి ఎన్నికల కమిషన్ అయినా, ఎవరైనా శాసన సభా హక్కులపై జోక్యం చేసుకోవాలి అన్నారు. సభా సాంప్రదాయ హక్కులను నిమ్మగడ్డ కాలరాస్తున్నారని మోపిదేవి ఆరోపించారు. ప్రజాప్రతినిధుల హక్కులను కాపాడేందుకు కొన్ని నిబంధనలు, చట్టాలు ఉన్నాయన్నారు. సభా హక్కులను కాపాడేందుకు ఎస్ఈసీని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించిన.. సభా సంప్రదాయాలను అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్రంలో తెదేపా నేతలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సానుభూతి కోసమే వారిపై వారే దాడి చేయించుకునేలా తెదేపా నేతలు వ్యూహాలు రచిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు అన్ని తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగమేనని రాజ్యసభ సభ్యులు మోపిదేవి తెలిపారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దేవినేని, మల్లికార్జున రావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'కచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఈ పాట్లన్నీ ఎందుకు ?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.