వైకాపా ఎమ్మెల్యేల బృందం డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిసింది. ఎస్ఈసీ పేరిట విడుదలైన లేఖపై విచారణ చేపట్టాలని కోరింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, పార్థసారథి తెదేపాపై విమర్శలు గుప్పించారు. తెదేపా చేసిన కుట్రలో భాగమే ఎస్ఈసీ లేఖ అని ధ్వజమెత్తారు. లేఖపై రాసింది నిజమా కాదా అనే విషయంపై రాష్ట్ర ప్రజలందరికీ సందిగ్ధత నెలకొందన్నారు. ఈ విషయంలో ఎస్ఈసీ రమేశ్‌కుమార్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆయన మౌనం కుట్రలో భాగమని మండిపడ్డారు. ఒకవేళ లేఖరాస్తే అధికారికంగా చెప్తే సమస్య లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: