అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లకు చట్ట విరుద్ధంగా జీవో 41 ఇచ్చారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్సీ రైతులు తనకు ఫిర్యాదు చేశారని, దానిపై ఆధారాలు సేకరించే.. చంద్రబాబుపై సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో 500 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో భూములను అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఎవరూ ఉన్నా దొరికిపోతారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి