ప్రజల రక్షణకు కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసమే రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని వైకాపా ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైకాపాను దెబ్బతీయడానికే నిఘా వ్యవస్థను వినియోగించారని ట్విట్టర్ వేదికగా ఆక్షేపించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పనిచేశారని విమర్శించారు. పరికరాలు కొని తనతో సహా వైకాపా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేసి... ఓ మాఫియాను నడిపారని ధ్వజమెత్తారు. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన అక్రమాలను తెదేపా ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని సజ్జల అన్నారు.
ఇవీ చూడండి: