ETV Bharat / city

సభలో చెప్పుతో కొట్టుకున్న వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు.. కారణం ఇదే!

subbarayudu: ముదునూరి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిందుకు బాధ పడుతున్నాంటూ వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంలో నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.

kottapalli subbarayudu comments
వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు
author img

By

Published : Mar 2, 2022, 4:46 PM IST

kottapalli subbarayudu: నరసాపురం జిల్లా కేంద్ర సాధనలో ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిందుకు బాధ పడుతున్నాంటూ.. చెప్పుతో తనని తాను కొట్టుకున్నారు.

వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు

జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో సభ నిర్వహించారు. జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మోసం చేశారని సుబ్బారాయుడు విమర్శించారు.

జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేలా కృషి చేయకుండా ప్రజలను ప్రసాదరాజు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మండలి మాజీ చైర్మన్ షరీఫ్, తెలుగుదేశం నేతలు మాధవనాయుడు, రామరాజు, జనసేన నేతలు బొమ్మిడి నాయకర్, ప్రకాష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మీ చిన్నాన్నను చంపిన వారు నీకు రెండు కళ్లా..? సీఎంపై తెదేపా నేతల ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.