ముఖ్యమంత్రి జగన్ పక్క రాష్ట్రం సీఎంతో లాలూచిపడి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం వద్ద మరో ఎత్తిపోతల నిర్మాణ ప్రతిపాదనతో కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వాస్తవాలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ఉమ ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి 'సోమవారం- పోలవరం' పేరిట ప్రజలకు పారదర్శకంగా అన్ని విషయాలు వెల్లడించామన్నారు.
రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే పోలవరం పవర్ ప్రాజెక్టు పనులను 18 నెలలుగా నిలిపివేశారని మండిపడ్డారు. పవర్ ప్రాజెక్టు కొట్టేసేందుకు వైకాపా యత్నిస్తోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ తాకట్టు పెట్టి రైతులతో చెలగాటం ఆడుతున్నారని దేవినేని వెల్లడించారు.
ఇదీ చదవండి