తిరుపతి ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు పంపిణీ చేస్తోన్న కరపత్రాలపై ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. అసత్యాలను కరపత్రాల్లో ప్రచురించి వాటిని ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయంలో సీఈవో విజయానంద్‌కు ఆ పార్టీ నేతలు లేఖ ఇచ్చారు. పెట్రోల్ , డీజిల్ రేట్లు కేంద్రం పెంచడం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని తెలిపారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని కరపత్రాలు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తెదేపా గుర్తింపును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి