తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మదనపల్లి సబ్‌డివిజనల్ అధికారి నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఖండించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని చంద్రబాబు కోరడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు.
సాక్ష్యాలు ఇవ్వండి మేము విచారిస్తామని చెప్పడం బాధ్యత గల పోలీసులకు తగదని హితవు పలికారు. విచారణ, దోషులను పట్టుకుని శిక్షించాల్సిన కర్తవ్యం పోలీసులదని.. యనమల అన్నారు. గతంలో ఇలాగే విశాఖ పర్యటనలోనూ నోటీసులిస్తే ఏం జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు. నోటీసులు ఇవ్వడం, బెదిరింపులు, వేధింపులతో ప్రతిపక్షాలకు కళ్లెం వేయాలని అనుకుంటే అది జరగని పని అని యనమల తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి