అవాస్తవాలతో ఆర్థికమంత్రి బుగ్గన అప్పులను దాయలేరని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృఘ్ణడు విమర్శించారు. ఈ ఏడాది ఆర్ధికాభివృద్దిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధిరేటు, తలసరి ఆదాయం, అప్పుల వివరాలతో పాటు.... ఏ రంగానికి ఎంత బడ్జెట్, ఖర్చు, కోత వివరాలు వెల్లడించాలన్నారు.
కరోనా, లాక్డౌన్ల వంకతో వైఫల్యాలను తప్పించుకోలేరని... గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం 9 రోజులేనని యనమల గుర్తు చేశారు. అనుభవం తెదేపాదైతే... అబద్ధాలు వైకాపావనే విషయం ప్రజలకు అర్థమైందని అన్నారు. వైకాపా నేతలు అబద్దాలతో తమ అనుభవాన్ని హేళన చేయాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు.
ఇవీ చదవండి: