ఐదు రోజుల శాసనసభ నిర్వహణ ...సీఎం జగన్ అహంభావానికి అద్దం పట్టిందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సమావేశాల్లో ప్రభుత్వ 6 నెలల వైఫల్యాలను ఎండగట్టామని చెప్పారు. బలహీన వర్గాలకు ప్రాధాన్యం లేని పదవులిచ్చి...కీలక పోస్టులన్నీ సొంత సామాజిక వర్గానికే కేటాయించారని ఆరోపించారు. 300కు పైగా పదవులు ఒక సామాజిక వర్గానికి కట్టబెట్టారని... అదే విషయం జీవోల ద్వారా వెల్లడవుతోందని అన్నారు. 50శాతం పదవులు బడుగులకే అన్న జగన్ నినాదం ...వంచనేనని దుయ్యబట్టారు. ‘‘దిశ ’బిల్లు తెచ్చాక కూడా రాష్ట్రంలో అత్యాచారాలు జరగడం సిగ్గుచేటని విమర్శించారు. అత్యాచారాలకు పాల్పడిన సొంత సామాజిక వర్గం వారిపై చర్యలు లేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయించడంపైనా మండిపడ్డారు. తక్షణమే జీవో 2430ని రద్దు చేయాలని యనమల డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: