శాసనమండలి ఏర్పాటు చేసే సెలక్ట్ కమిటీని ప్రభుత్వం ఉద్దేశ్వపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తోందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. ప్రభుత్వం, కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న తీరు ఇక్కడ రుజువవుతోందని వెల్లడించారు. చట్ట సభల్లో సభాపతి లేదా మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించడం, లేదా ధిక్కరించే అధికారం అధికారులతో సహా ఎవ్వరికీ లేదని యనమల తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి అనేక చట్టాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు.
ఇదీ చదవండి : బిల్లులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం