ETV Bharat / city

కన్నుల పండువగా యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు - లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు ఈ నెల 25న ముగుస్తాయి.

కన్నుల పండువగా యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 15, 2021, 1:11 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు జరగనున్నాయి. విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలయ్యే ఉత్సవాలు... 25 న డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

16న ధ్వజారోహణం, రాత్రి భేరిపూజ నిర్వహించనున్నారు. 17 నుంచి 23 వరకు వివిధ అలంకార సేవలపై బాలాలయంలో స్వామి వారిని విహరింపచేయనున్నారు. 21 న రాత్రి ఎదుర్కోలు, 22న తిరుకల్యాణం నిర్వహించనున్నారు. ఈనెల 11న హైదరాబాద్‌ యాదగిరి భవన్‌లో ప్రారంభమైన అఖండజ్యోతి పాదయాత్ర యాదాద్రికి చేరుకుంది.

ఇదీ చూడండి: మైదుకూరులో తెదేపా జోరు.. ఫ్యాన్ గాలిని తట్టుకుని ఎలా సాధ్యమైంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.