ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు - World Photography Day celebrations across the state

రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్లు కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

World Photography Day celebrations across the state
రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు
author img

By

Published : Aug 20, 2020, 12:14 AM IST

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవన్ లో ఫోటోగ్రాఫర్లు కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా సందర్భంగా ఫోటోగ్రాఫర్లు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
పి.గన్నవరంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే విగ్రహానికి అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతపురం జిల్లాలో..
గుత్తి పట్టణం నిజామి ఫంక్షన్ హాల్ లో గౌతమి పురి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంకాలం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఫోటో వీడియో గ్రాఫర్ లకు శుభకార్యాలు లేక చాలా నష్టపోయామన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

విశాఖ జిల్లాలో..
చోడవరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకగా నిర్వహించారు. చోడవరం-మాడుగుల నియోజకవర్గాల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చోడవరం పోలీస్ సబ్ఇన్ స్పెక్టర్ డి.లక్ష్మీ నారాయణ హాజరయ్యారు. ఫోటోగ్రఫీ పితామహుడు లాయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు. 500 మందికి మాస్కులు అందజేశారు.

ఇవీ చదవండి: విశాఖను రౌడీ దందాలకు అడ్డాగా మార్చారు: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.