ETV Bharat / city

WORLD AUTISM DAY: "ప్రపంచ ఆటిజం అవగాహన దినం"... ప్రత్యేక కథనం

Autism Awareness Day: సాధారణ శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్లలో కళ్లు పెట్టి నవ్వితే నవ్వుతారు. అయితే ‘ఆటిజం’ పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు. ‘ఆటిజం’లో ఇదొక ప్రధాన లక్షణం. మనదేశంలో దాదాపు 2 శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదల లోపం తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. ఏప్రిల్‌ 2న (శనివారం) ‘ప్రపంచ ఆటిజం అవగాహన దినం’ సందర్భంగా ఈ జబ్బుపై అవగాహన కల్పించే ప్రత్యేక కథనం..

Autism Awareness Day
ప్రపంచ ఆటిజం అవగాహన దినం
author img

By

Published : Apr 2, 2022, 10:36 AM IST

Autism Awareness Day: ప్రతి తల్లి, తండ్రి ఉల్లాసంగా ఆడుకునే ఆరోగ్యకరమైన సంతానాన్ని ఊహించుకుంటారు. కానీ ఎవరైనా చిన్న వయసులో అసాధారణంగా, మందబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటే వారి నానమ్మలు, అమ్మమ్మలు ఇటువంటి పిల్లలను మన వంశంలో ఎప్పుడూ చూడలేదు అని దిగులు పడుతుంటారు. ఇటువంటి పిల్లలనే ఆటిజం ఉన్న పిల్లలుగా గుర్తించవచ్చు. దీనిని ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ అని కూడా అంటారు. సాధారణ శిశువుకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే తల్లిని గుర్తుపడతారు. చూపుతో చూపు కలుపుతారు. కళ్లలో కళ్లు పెట్టి నవ్వితే నవ్వుతారు. అయితే ‘ఆటిజం’ పిల్లల్లో చూపు మామూలుగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులను గుర్తుపట్టలేరు. వినికిడి సాధారణంగానే ఉంటుంది. కానీ పేరు పెట్టి పిలిస్తే మన వైపు చూడరు. ‘ఆటిజం’లో ఇదొక ప్రధాన లక్షణం. భారత్​లో దాదాపు 2 శాతం పిల్లలు ఈ రకమైన జబ్బుతో బాధపడుతున్నారు

ఆటిజంను గుర్తించడమెలా?
ఏదైనా వస్తువు పెద్ద శబ్దంతో కిందపడేస్తే అటువైపు చూస్తారు. కానీ పేరు పెట్టి పిలిస్తే మాత్రం పలకరు. అమ్మ ఎక్కడుందని అడిగితే చూపించరు. ఇతర పిల్లలతో ఆడుకోరు. కొందరు ఒక చోట కుదురుగా కూర్చోరు. అక్షరాలను రాయడానికి కూడా ఏళ్లు పడుతుంటుంది. 7-8 ఏళ్లు దాటినా కూడా పక్క తడిపేస్తుంటారు. వీరిలో కొందరికి నిద్ర కూడా సరిగా పట్టదు.

ఎందుకు వస్తుంది?
* 15-20 శాతం జన్యుపరమైన లోపాలతో
* మిగిలిన 80-85 శాతం సరైన కారణాలను కనుగొనలేదు.

ప్రభుత్వం ఆదుకోవాలి: ఓ తల్లి
ఈ వ్యాధి గ్రామీణంతో పోలిస్తే పట్టణ, నగరాల్లో 9 రెట్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిబట్టి నగరీకరణ జీవన ప్రభావం కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వస్తున్నట్లుగా ప్రాథమికంగా శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. తల్లిదండ్రులు శిశు దశ నుంచి పిల్లలతో గడపడం తగ్గిపోయింది. ఫలితంగా శిశువు ఎక్కువగా మాటలను వినే అవకాశం తగ్గింది. చికిత్సలకు వ్యయం ఎక్కువగా అవుతుంది. ‘‘నెలకు చికిత్సలు చేయించడానికి కనీసం రూ.30-40వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు ఒక సాధారణ కుటుంబానికి ఎక్కడ నుంచి వస్తుంది? ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఆదుకోవాల’’ని ఒక బాధిత తల్లి ఆవేదన వెలిబుచ్చారు.

తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలి.. "ఆటిజానికి కచ్చితమైన చికిత్స అంటూ ఏమీ లేదు. అయితే ప్రతి ఒక్కరికి వారి లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్‌ థెరపీ, స్పీచ్‌ థెరపీ, బిహేవియర్‌ థెరపీ.. ఈ రకంగా చికిత్సలు ఉంటాయి. ఆయా చికిత్సల ద్వారా కచ్చితంగా మెరుగుదల కనిపిస్తుంది. తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలి. దేశంలో వీరికి నైపుణ్య శిక్షణ ఇచ్చే శిక్షకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం ఆటిజం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నైపుణ్య శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయాలి."

- డాక్టర్‌ లోకేశ్‌ లింగప్ప, సీనియర్‌ పీడియాట్రిక్‌ న్యూరాలజిస్ట్‌

ఇదీ చదవండి: Ugadi-2022: ఉగాది పర్వదినం.. షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.