ETV Bharat / city

ట్రెండీ డ్రెస్సులు.. ఫ్యాషన్ సొగసులు.. మహిళలకే ఎక్కువ - ఉమెన్స్ ఫ్యాషన్ 2020

ట్రెండ్ మారుతోంది.. ఫ్యాషన్ ట్రెండ్‌కు తగినట్టుగా మహిళల జీవన విధానంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది. మగవారితో సమానంగా.. మహిళలు మోడ్రన్ కల్చర్‌కు అలవాటు పడుతున్నారు. ప్రత్యేకించి ఫ్యాషన్ ట్రెండ్‌ అంతా ఇప్పుడు ధరించే దుస్తులదే. షాపింగ్​కు​ వెళ్లడం.. ఖరీదైన గిఫ్ట్‌లు, వెరైటీ డ్రెస్సులను కొనుగోలు చేయడం నేటి యువతకు ట్రెండ్‌గా మారిపోయింది. మహిళల కోసం ప్రత్యేకించి ఎన్నో ట్రెండీ దుస్తులు మార్కెట్​లో ఆకర్షణీయంగా ఉండటంతో యువత కూడా వాటిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

womens day special
womens day special
author img

By

Published : Mar 8, 2020, 7:33 AM IST

ట్రెండీ డ్రెస్సులు..ఫ్యాషన్ సొగసులు..మహిళలకే ఎక్కువ

ఒకప్పుడు అబ్బాయిలే జీన్స్ వేసుకునేవారు. ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేక డిజైన్లతో జీన్స్ వంటి ఎన్నో రకాల దుస్తులు మార్కెట్లోకి వచ్చేశాయి. అబ్బాయిలు కావొచ్చు.. అమ్మాయిలు కావొచ్చు.. డ్రెస్ డిజైన్ల విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదు. అందుకే వినియోగదారుల అభిరుచికి తగట్టుగానే ఫ్యాబ్రిక్ దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి పలు దుస్తుల కంపెనీలు.

మహిళలకే ప్రాధాన్యత..

అసలు ఫ్యాబ్రిక్ దుస్తుల విషయంలో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. మహిళల దుస్తులకు, పురుషుల దుస్తులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదని, ధరలు, బట్టల డిజైన్ కాస్త దగ్గరగా ఉంటుందని తెలుసు. అయితే, ఫ్యాబ్రిక్ దుస్తుల తయారీ కంపెనీల్లో ఎక్కువగా మహిళలకు సంబంధించి బ్లౌజులు, టీషర్టులే ఉంటాయి. ఇవన్నీ చాలా తేలిగ్గా.. మోడ్రన్​గా ఉంటాయి.

ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండే కారణం ..

పురుషుల దుస్తులయితే కాస్త మందంగా ఉండి బరువుగా ఉంటాయి. పురుషులతో పోలిస్తే.. మహిళల దుస్తులు ఎందుకు పలచగా ఉంటాయనడానికి ఫాస్ట్ ఫ్యాషన్ కారణమని చెప్పొచ్చు. అందుకే .. మహిళా దుస్తుల్లో ఎక్కువ శాతం పలచని దుస్తుల వాడకమే ఫాస్ట్ ట్రెండ్​గా మారింది. మహిళల దుస్తులపై తేలిగ్గా ఉండే బట్టను ఉపయోగించే ధోరణి ఫాస్ట్ ఫ్యాషన్ పెరుగుదలతో ముడిపడి ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది.

ప్రత్యేకించి మహిళల కోసం తేలిక దుస్తులను డిజైన్ చేసే.. ఎన్నో కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఫాస్ట్ ఫ్యాషన్ ఎందుకింత చౌకగా మారిందంటే.. సింథటిక్ పదార్థాలను ఉపయోగించడం, అలాగే వేతనాలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో బట్టలు తయారు చేయడం, తయారీ ప్రక్రియ కూడా అధునాతనంగా ఉంటుంది.

అందుకే ఉద్యోగాలు, కళాశాలలకు వెళ్లే మహిళలకు టాప్స్, జీన్స్, డ్రెస్ మెటీరియల్స్ ట్రెండీ ట్రెండీగా అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు వీటికి డిమాండ్ బాగా పెరిగింది. యువత అభిరుచికి తగ్గట్టుగా మార్కెట్లో అన్ని రకాల మోడ్రన్ దుస్తులు అందుబాటులో ఉంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.