రాష్ట్ర ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా ఐఏఎస్ అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ను కలిసిన పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన మహిళా ఐఏఎస్ అధికారులు బి.ఉదయలక్ష్మి, వి.ఉషారాణి, కె.సునీత, జి. వాణి మోహన్, రేఖా రాణి, కె.మాధవీలత, కె.విజయ... సీఎస్‌ను కలిసి శుభాభినందనలు తెలిపారు. కీలకమైన ఏపీ రాష్ట్రానికి సీఎస్‌గా నీలం సాహ్ని మెరుగైన సేవలందిస్తున్నారని మహిళా అధికారులు కొనియాడారు
ఇదీ చూడండి: 'ఆలయ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వానిదే కాదు... ప్రజలకూ ఉంది'