ETV Bharat / city

వలలో చిక్కి.. విలవిల.. అతివల వ్యక్తిగత చిత్రాల మార్ఫింగ్‌

Women harassment: తరతరాలుగా వేళ్లూనుకుపోయిన సమాజ కట్టుబాట్లను ఛేదించుకొని.. ఇప్పుడిప్పుడే హక్కులు, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు మహిళలు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగటంతో.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికలను సైతం అతివలు ఉపయోగిస్తున్నారు. కానీ కొందరు మోసగాళ్లు మాత్రం.. నకిలీ ఐడీలతో యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వ్యక్తిగత చిత్రాలను మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Women harassment on social media with photos morphing
అతివల వ్యక్తిగత చిత్రాల మార్ఫింగ్‌
author img

By

Published : Jul 25, 2022, 9:37 AM IST

Women harassment: విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగింది. ఫలితంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, స్నాప్‌చాట్‌.. తదితర సోషల్‌ మీడియా వేదికలను ఉపయోగించేవారి సంఖ్య అదే స్థాయిలో ఎగబాకింది. ముఖ్యంగా యువతరం నిరంతరం వీటికి అనుసంధానమై ఉంటున్నారు. నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు వీటితోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో పులువురు మోసగాళ్లు నకిలీ ఐడీలతో యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వ్యక్తిగత చిత్రాలను మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల జిల్లాలో నమోదవుతున్నాయి.

నగరానికి చెందిన ఓ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు తన ఫొటోను మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలు వచ్చాయి. వీటినే తన స్నేహితురాళ్లకూ గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్‌ చేశాడు. కొన్ని రోజులకు ఆ వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. వీడియో కాల్స్‌ చేయాలని తీవ్రంగా ఒత్తిడి పెంచాడు. దీనికి ఆమె నిరాకరించడంతో మార్ఫింగ్‌ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. చివరకు ఇది విద్యార్థినిని కళాశాల నుంచి సస్పెండ్‌ చేసే వరకు వెళ్లింది.

కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ ఆన్‌లైన్‌ ద్వారా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. తాను ప్రమోట్‌ చేసే యాప్‌నకు సంబంధించి వివరాలు ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో ఉంచింది. తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన గణేష్‌.. యువతికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. తాను కూడా యాప్‌ను ప్రచారం చేస్తానని, ఆమెకు సంబంధించి వివరాలు తెలుసుకున్నాడు.

యువతి ఫొటోపై ఆమె, కుటుంబ సభ్యుల ఫోన్‌నెంబర్లు ఉంచి కాల్‌గర్ల్‌ అంటూ కొన్ని ఫేస్‌బుక్‌ ఖాతాలకు పంపించాడు. వాటిని తొలగించాలంటే నగ్నంగ్‌ వీడియో కాల్‌ చేయాలని బెదిరించాడు. చేసేది లేక ఆ యువతి వీడియో కాల్‌ చేసింది. దానిని నిందితుడు రికార్డు చేసుకున్నాడు. తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆ వీడియోను అందరికీ పంపుతానని ఆమెకు బ్యాంకు ఖాతా వివరాలు పంపించాడు. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. చివరకు నిందితుడు గణేష్‌ను వలవేసి పట్టుకున్నారు.

బయటకు చెప్పుకోలేక కుంగుబాటు.. సోషల్‌ మీడియా ఖాతాల్లోని ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ బాధితుల స్నేహితులు, బంధువులకు షేర్‌ చేస్తున్నారు. వాటిని అడ్డుంపెట్టుకుని నగ్నంగా వీడియో కాల్స్‌ చేయమని, ఫొటోలు పంపమని మోసగాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. సమస్య అంతటితో పరిష్కారం అవుతుందని, ఆ వ్యక్తి చెప్పినట్లే చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగడం లేదు. చాలా మంది పరువు పోతుందనే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.

  • నగరంలోని పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలో నివసించే యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, వాట్సాప్‌ ద్వారా తరచూ సంభాషించుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆమెకు సంబంధించి వ్యక్తిగత, ఏకాంతంగా ఫొటోలను తీసుకున్నాడు. అనంతరం యువకుడి గత చరిత్ర తెలుసుకుని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు పెళ్లిసంబంధాలు చూస్తున్న విషయం తెలుసుకుని ఫొటోలను పలువురికి షేర్‌ చేశాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్రమత్తత తప్పనిసరి.. సోషల్‌ మీడియా ఖాతాలకు ప్రైవసీ సెట్టింగ్స్‌ పకడ్బందీగా ఉండాలి. పాస్‌వర్డ్‌లు అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులతో మిళితం చేసి పెట్టుకోవాలి.

  • వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలను ఎట్టి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో షేర్‌ చేయకూడదు. అవసరమైన మేరకే యాక్సెస్‌ ఇవ్వడం శ్రేయస్కరం.
  • గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించకూడదు.
  • లైవ్‌ లొకేషన్లను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయకూడదు. దీని వల్ల ఎక్కడ ఉన్నామో ఇతరులకు తెలిసే అవకాశం ఉంది.
  • ఖాతాలకు ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకుంటే దానిని ఎవరూ షేర్‌ చేసుకునే అవకాశం లేకుండా చూసుకోవాలి. దీనికి ప్రొఫైల్‌ లాక్‌ సెట్‌ చేసుకోవాలి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.