ETV Bharat / city

WOMAN COMPLAINT ON SI: సైఫాబాద్ ఎస్​ఐ, కానిస్టేబుల్​పై మహిళ ఫిర్యాదు

author img

By

Published : Feb 19, 2022, 5:17 PM IST

WOMAN COMPLAINT ON SI: తెలంగాణలోని సైఫాబాద్ పోలీస్​స్టేషన్​లో పనిచేస్తున్న ఎస్ఐ సూరజ్, మరో కానిస్టేబుల్​పై ఓ మహిళ అదే పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బస్సు డ్రైవర్​తో గొడవ విషయంలో ఎస్​ఐ తనను అకారణంగా కొట్టారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్‌తో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరింది.

WOMAN COMPLAINT ON SI
WOMAN COMPLAINT ON SI

WOMAN COMPLAINT ON SI: తెలంగాణలోని సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ సూరజ్‌, ఓ కానిస్టేబుల్​పై ఓ మహిళ అదే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఎస్​ఐ తనను అకారణంగా కొట్టారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. డ్రైవర్‌తోపాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరింది.

అసలు ఏం జరిగిదంటే..?
బాధిత మహిళ శుక్రవారం రాత్రి కారులో నాంపల్లి వైపు వెళ్తుండగా.. ఓ బస్సు తమ కారుకు తగిలిందని ఆ డ్రైవర్‌తో గొడవకు దిగారు. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న సైఫాబాద్‌ ఎస్‌ఐ సూరజ్‌, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గొడవకు దిగిన మహిళ దగ్గర్నుంచి బస్సు డ్రైవర్‌ను పక్కకు తీసుకెళ్లారు.

దీంతో.. అప్పటికే అధిక సంఖ్యలో చేరుకున్న మహిళ తరపు బంధువులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఎస్‌ఐ తమపై లాఠీచార్జ్‌ చేశారని వారు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సైఫాబాద్‌ డీఐ రాజునాయక్‌ అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పారు. అనంతరం బాధిత మహిళ ఎస్​ఐ సూరజ్, ఓ కానిస్టేబుల్​పై అదే స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుల పెండింగ్: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.