ETV Bharat / city

Suicide: ఫోన్​ ఎక్కువగా మాట్లాడుతుందని అత్త మందలింపు... కోడలు ఆత్మహత్య - భరత్‌నగర్‌లో మహిళ ఆత్మహత్య

Woman Suicide in Bharatnagar: ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది ఆ నవవధువు. ఇన్నాళ్లూ అమ్మానాన్నలతో ఉన్న ఆమెకు.. అత్తింట్లో అంతా కొత్తగా అనిపించింది. నెమ్మది నెమ్మదిగా సర్దుకుపోతున్న తరుణంలో.. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నావేంటని అత్త మందలించింది. అప్పటికే పుట్టిల్లుపై బెంగతో ఉన్న ఆ యువతి.. అత్త మందలింపుతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Woman Suicide
Woman Suicide
author img

By

Published : Mar 17, 2022, 9:35 AM IST

Woman Suicide in Bharatnagar : ఎక్కువగా ఫోను మాట్లాడుతోందని అత్త మందలించడంతో నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నగరంలోని ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చోటు చేసుకుంది. బోరబండలోని భరత్‌నగర్‌కు చెందిన పవన్‌తో సికింద్రాబాద్‌ అడిక్​మెట్​కు చెందిన శిల్ప(22)కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శిల్ప అత్తారింటికి వెళ్లింది. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. నెమ్మది నెమ్మదిగా అత్తాకోడళ్ల మధ్య చిన్నచిన్న తగాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఒక రోజు.. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నావని అత్త కోడలిని మందలించింది. ఈ విషయంలో అత్తాకోడళ్ల మధ్య వివాదం చెలరేగింది.

అత్తారింట్లో సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్న శిల్పకు అత్త మందలింపు మనస్తాపానికి గురి చేసింది. పుట్టింటిపై బెంగ ఓ వైపు.. అత్త మందలింపు మరోవైపు.. ఆమెను మనోవేదనకు గురి చేశాయి. ఈ క్రమంలో శిల్ప ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప గర్భం దాల్చినట్లు సమాచారం.

  • ఇదీ చదవండి :

అక్రమంగా భూమి కాజేశారు.. తప్పించుకోడానికి సినిమా ప్లాన్ వేశారు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.