రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఒకటి, రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
ఇదీ చదవండి: