రాజధానిని ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది సరి కాదని అన్నారు. రాజధానిని ఒక్క ప్రాంతంలోనే ఉంచి... మిగిలిన రెండు ప్రాంతాల్లో మినీ సచివాలయం, హైకోర్టు బెంచ్, శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకానీ మూడు ముక్కలాట వద్దని అన్నారు. దక్షిణాఫ్రికాలోనూ ప్రధాన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటాయని వెల్లడించారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం అంత సులభం కాదన్న ఆయన... హైకోర్టు బెంచ్‌ను మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. వీటితో పాటు చైనాలోని వూహాన్లో చిక్కుకున్న కర్నూలు జిల్లా యువతిని భారత్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎంపీ వెల్లడించారు. యువతి కుటుంబానికి అన్ని విధాలా సాయమందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: