దృశ్య కావ్యం.. రథంగుట్టలో సెలయేటి అందాలు నయనానందకరం - రథం గుట్టపై జలపాతం తాజా వార్తలు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రథం గుట్టపై జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కొండల నుంచి జాలువారుతూ కనువిందు చేస్తోంది. చినరాయగూడెం జలపాతం వద్దకు సందర్శకుల తాకిడి పెరిగింది. రహదారి సమీపంలో జలపాతం ఉండటం వల్ల అటుగా వచ్చే వారు జలపాతం వద్దకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. జలపాతాలను సందర్శించేందుకు అనువైన మార్గం లేదని.. ప్రభుత్వం స్పందించి రహదారి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
waterfalls-of-ratham
By
Published : Aug 16, 2020, 9:34 PM IST
దృశ్య కావ్యం.. రథంగుట్టలో సెలయేటి అందాలు నయనానందకరం