ETV Bharat / city

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కావలెను..! - water project estimation cost in ap

రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు రూ.25,698 కోట్లు అవసరమవుతాయని అధికారుల తాజా లెక్కలు తేల్చాయి. పోలవరం ప్రాజెక్టుపై చేసే ఖర్చును మినహాయించగా ఇతర ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు ఇది. కొత్త ప్రాజెక్టుల విలువ రూ.1,17,842 కోట్లుగా లెక్కిస్తున్నా.. తుది అంచనాలు తేలే సరికి ఈ అంకెలు మారే అవకాశం ఉంది.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కావలెను..!

author img

By

Published : Feb 17, 2020, 3:48 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులకు దాదాపు రూ.25,698 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. పోలవరానికి చేసే ఖర్చు మినహాయించగా వేసిన అంచనాలివి. అంతే కాకుండా కొత్త ప్రాజెక్టులపైనా సర్కారు దృష్టి సారిస్తోంది. వీటి విలువ రూ.1,17,842 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

మూడు దశలుగా ప్రాజెక్టులు

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 3 ప్రాధాన్యాలుగా విభజించి లెక్కలు రూపొందించారు. ఏ సాగునీటి సర్కిల్‌ కింద ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి..? వాటిపై ఇప్పటివరకూ చేసిన, ఇకపై చేయబోయే ఖర్చు ఎంత..? వాటి నిర్మాణం పూర్తైతే సాగులోకి వచ్చే ఆయకట్టు విస్తీర్ణమెంత, అందులో ఎంతమేర స్థిరీకరణ చేయవచ్చనే అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. అధికారుల లెక్కల ప్రకారం... తొలి ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.20,871 కోట్లు, రెండో ప్రాధాన్యమైన వాటికి రూ.1,294 కోట్లు... మూడో ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.3,533 కోట్లు అవసరమవుతాయి.

రూ.4,500 కోట్లు మాత్రమే బిల్లుల చెల్లింపులు

కొత్తగా నిర్మించదలిచిన ప్రాజెక్టులకు నిధులు ఎక్కడ్నుంచి తీసుకురావాలనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై చేసిన ఖర్చు తక్కువే. ఇటీవల వరకూ సాగునీటి ప్రాజెక్టులపై కేవలం రూ.4,500 కోట్లు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరిగాయని జలవనరుల శాఖ అధికారుల సమాచారం. ఈ ఏడాది కొన్ని ప్రాజెక్టులు మినహా.... మిగిలిన చోట్ల మట్టి తవ్వకాలు కానీ, కాంక్రీటు పనులు కానీ ఏమీ జరగట్లేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ రంగానికి రూ.13,000 కోట్లు కేటాయించగా... చేపట్టిన పనులు అంతంతమాత్రమే. ఈ ఆర్థిక ఏడాది ముగియడానికి కేవలం నెల కన్నా కాస్త ఎక్కువే ఉండటంతో కేటాయింపుల్లో సగం ఖర్చైనా సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.