ETV Bharat / city

Huzurabad bypoll: హుజూరాబాద్​లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..! - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో(Huzurabad by elections 2021) కవర్లు కలకలం రేపుతున్నాయి. డబ్బులతో కూడిన కవర్లను చూసి ఓటర్లు అవాక్కవుతున్నారు. ఒక్కో కవర్​లో రూ.6 వేల నుంచి రూ.10 వేలు ఉండడం గమనార్హం. కాగా నేటితో ప్రచార ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.

Huzurabad by elections 2021
Huzurabad by elections 2021
author img

By

Published : Oct 27, 2021, 1:44 PM IST

Huzurabad by elections 2021: హుజూరాబాద్​లో కవర్ల కలకలం.. ఓపెన్ చేస్తే డబ్బులే డబ్బులు..!

తెలంగాణలోని హుజూరాబాద్​ ఉపఎన్నికల(Huzurabad by elections 2021) నేపథ్యంలో నియోజకవర్గంలో కవర్లు కలకలం రేపుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు డబ్బులతో కూడిన కవర్లు ఓటర్ల చెంతకు చేరుతున్నాయి. వాటిని అందుకున్న ఓటర్లు... కవర్లలో ఉన్న డబ్బు చూసి అవాక్కవుతున్నారు. ఒక్కో కవర్​లో రూ.6వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వంద మందికి ఒక స్థానిక నాయకుడిని అప్పజెప్పినట్లుగా పేర్కొన్నారు. పైగా డబ్బులు ఉన్న కవర్లపై నంబర్లు వేసి ఉండడం గమనార్హం. ఒకటో నంబర్ ఉంటే ఒకరికి, రెండో నంబర్ ఉంటే ఇద్దరికీ డబ్బులు అని ఓటర్లు అంటున్నారు. నేటితో ప్రచార ఘట్టం ముగియనున్న నేపథ్యంలో... తెరమీదకు వచ్చిన కవర్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.

నేటితో మైకులు బంద్

మంత్రిగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ భాజపాలో చేరడంతో హుజూరాబాద్​ ఎన్నికలు (huzurabad by election ) ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఉపఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. ఎన్నికలను ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు సవాల్‌గా స్వీకరించాయి. బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌(తెరాస), ఈటల రాజేందర్‌(భాజపా), బల్మూరి వెంకట్‌(కాంగ్రెస్‌)ల తరఫున మూడు పార్టీలు ప్రచారంలో నువ్వా-నేనా అనే తరహాలో పోటీ పడ్డాయి. ఓటర్ల మన్ననల్ని పొందేందుకు చెమటోడ్చాయి.

తెరవెనుక మంత్రాంగానికి సిద్ధం

ఇప్పటివరకు ప్రచారంలో ప్రత్యక్షంగా ఓటర్లను మెప్పించిన పార్టీలు ఇకపై తెరవెనుక మంత్రాంగానికి సిద్ధమయ్యాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఓటుకు ఇంత మొత్తమనేలా నగదు పంపిణీకి రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మద్యం సీసాలను పలుచోట్ల పంపిణీ చేశారనే ప్రచారం వినిపిస్తోంది. దసరా పర్వదినం సందర్భంగా ఆయా పార్టీలవారు మాంసంతో పాటు మద్యాన్ని విరివిగా పంచారని అంటున్నారు.

ఆ 2 రోజులే కీలకం

పోలింగ్‌కు ముందు 28, 29 తేదీల్లో లోలోపల జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లుగా అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా తాయిలాలు, ప్రలోభాలపర్వం అధికంగా కనిపించే వీలుంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా నియోజకవర్గంపై దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కవర్ల పంపిణీ కలకలం రేపుతోంది.

ఇదీ చదవండి:Pawan kalyan tweet: ఏపీ మాదక ద్రవ్యాల కేంద్రంగా మారింది: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.