ETV Bharat / city

వాయిస్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్.. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్విస్ పాత్రే స్ఫూర్తి - Hyderabad Shahid Nihal Voice based software

కార్టూన్లు, యాక్షన్ సినిమాలు చూస్తూ పిల్లలు అందులోని పాత్రలను అనుకరిస్తారు. కానీ పన్నెండేళ్ల ఓ బాలుడు మాత్రం సినిమాలోని ఓ కల్పిత పాత్రకు ప్రాణం పోసి ఏకంగా సాఫ్ట్‌వేర్‌నే రూపొందించాడు. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్విస్ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని దాని ఆధారంగా వాయిస్ ఆధారిత స్క్రిప్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి ఔరా అనిపిస్తున్నాడు హైదరాబాద్​కు చెందిన షాహిద్ నిహాల్. ఇంతకీ ఏంటా సాఫ్ట్‌వేర్, దాని విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం.

Hyderabad Shahid Nihal Voice based software
షాహిద్ నిహాల్
author img

By

Published : Apr 1, 2021, 10:13 AM IST

హైదరాబాద్​కు చెందిన నిహాల్‌కు చిన్నతనం నుంచి ఆవిష్కరణలంటే ఇష్టం. లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని గూగుల్‌, యూట్యూబ్‌లలో కోడింగ్‌ నేర్చుకున్నాడు. చరవాణుల్లో ఇప్పటికే ఒక్కమాట చెబితే వాయిస్‌ అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌లు అన్ని పనులు చేసిపెడుతున్నాయి. అయితే నిహాల్‌ రూపొందించిన జార్విస్‌ సాఫ్ట్‌వేర్ కేవలం చరవాణిలోనే కాకుండా నోట్‌ప్యాడ్‌, విండోస్‌, ఫైల్స్‌, మ్యాప్స్‌ ఇలా ఎక్కడైనా చెప్పిన మాటలకు అక్షర రూపాన్ని ఇవ్వగలదు. ముఖ్యంగా ఎక్కువగా టైప్‌ చేసేవారికి, అంధులకు ఈ సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగపడుతుందని నిహాల్ చెబుతున్నాడు. ఐరన్‌మ్యాన్‌ సినిమాలో వాయిస్‌ అసిస్టెంట్‌ జార్విన్‌ను స్ఫూర్తిగా తీసుకుని దీనిని రూపొందించినట్లు వెల్లడించాడు.

వాయిస్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్ తయారు చేసిన హైదరాబాద్ షాహిద్ నిహాల్

తదుపరి ప్రాజెక్ట్ అదే..

కళ్లద్దాలలో ఇమిడిపోయే కంప్యూటర్‌ను రూపొందించడమే తన తదుపరి ప్రాజెక్టు అని నిహాల్‌ చెబుతున్నాడు. జార్విస్ అనేది ఆ ప్రాజెక్టు కోసం ఉపయోగించే ఒక టూల్ మాత్రమే అని తెలిపాడు. తాను రూపొందించబోయే మోస్ట్ సింప్లిఫైడ్ పీసీకి వాయిస్ ఆధారిత కమాండ్స్‌ను ఈ జార్విస్ ఇస్తుందని వెల్లడించాడు. ఎలక్ట్రానిక్ శాస్త్రవేత్త కావడమే తన లక్ష్యమని నిహాల్‌ ధీమాగా చెబుతున్నాడు.

ప్రభుత్వ సహకారం ఉంటే..

త్వరలో ఈ సాఫ్ట్‌వేర్‌కు పేటెంట్ కోసం కృషి చేసి... భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు వచ్చేలా ప్రోత్సహిస్తామని నిహాల్‌ తండ్రి సమీర్ అంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత సంస్థల... సహకారం, తోడ్పాటు ఉంటే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఓ మంచి ఆవిష్కరణను రూపొందించిన నిహాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: 'అదృష్టం కలిసొస్తే ఈ సారి టైటిల్ పంజాబ్​దే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.