ETV Bharat / city

'వివేకా హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం' - హైకోర్టులో వివేకా హత్యకేసు విచారణ

మాజీమంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం ఉందని ఆయన కుటుంబసభ్యులు హైకోర్టుకు తెలిపారు. అందుకే ఈ కేసు సీబీఐకి అప్పగించాలని విన్నవించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన జగన్​మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటున్నారని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. సిట్ దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది.

viveka murder case in high court
హైకోర్టులో వివేకా హత్యకేసు విచారణ
author img

By

Published : Feb 22, 2020, 12:02 AM IST

మాజీమంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ తుది దశకు చేరుకుంది. హత్య వెనుక ఐదుగురు రాజకీయ పెద్దల జోక్యం ఉందని వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె ఎన్.సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి తరఫున న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ... మరో పిటిషన్‌ దాఖలు చేసిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తరఫున న్యాయవాది ఆర్‌.బసంత్‌ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని వివరించారు.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్‌మోహన్‌ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని చెబుతున్నారని న్యాయవాది ఆర్‌.బసంత్‌ కోర్టుకు తెలిపారు. పాలనా యంత్రాంగం అంతా సీఎం చేతుల్లో ఉన్నందున.. హత్య కేసును తారుమారు చేయొచ్చని ఆరోపించారు. వివేకా హత్య వెనుక బలవంతుడైన దగ్గరి బంధువు పాత్ర ఉందంటూ మృతుని కుటుంబసభ్యులు చెబుతున్న దానికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిపై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలపై వాదనలు వినిపించేందుకు హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్... వివేకా హత్య కేసు దర్యాప్తు మరో రెండు నెలల్లో పూర్తి అవుతుందన్నారు. మృతుని కుమార్తె లేవనెత్తిన... సందేహాల కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందన్నారు. దర్యాప్తులో జాప్యం జరగుతోందనే కారణంతో సీబీఐకి అప్పగించాలని కోరడం సరికాదని ఏజీ అన్నారు. సందేహాలుంటే మొదట మేజిస్ట్రేట్ ముందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దర్యాప్తు పురోగతి, సిట్ సభ్యుల వివరాల్ని వేర్వేరుగా సీల్డ్ కవర్లో అందజేస్తున్నామని చెప్పారు. దర్యాప్తు కొనసాగింపునకు అనుమతించాలని కోరారు.

వివేకానంద రెడ్డి హత్య జరిగి 11నెలలు గడిచినా... అసలు నేరస్తులెవరో కనుగొనలేకపోయారని ఆదినారాయణరెడ్డి తరఫు న్యాయవాది అన్నారు. దర్యాప్తు వివరాల్ని సీల్డ్ కవర్లో కోర్టుకు ఇవ్వడంపైనా న్యాయవాది ఆర్‌.బసంత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వివరాల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని కోరారు. వివేకా హత్య కేసు జనరల్ డైరీ, కేసు డైరీలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్‌ను న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : దిశ చట్టం బాగుంది: మహారాష్ట్ర హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.