వినాయక చవితి సందర్భంగా సింగపూర్లో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ వారు అంతర్జాలం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచన కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరై.. పండగ విశిష్టత వివరించారు. వినాయకుని రూప విశేషాన్ని, అవతార విశేషాల వెనుక అన్న పరమార్థాన్ని చెప్పారు.
చిత్తశుద్ధి లేని ఆర్భాటాలు, ఆడంబరాలు భక్తి అనిపించుకోవని.. భగవంతునిపై ప్రేమతో చేసే పూజలే సంతృప్తిదాయకంగా ఉండి, సత్ఫలితాలు ఇస్తాయనీ చెప్పారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. ఇంటర్నెట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వేడుక నిర్వహించినట్టు సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: