ETV Bharat / city

పోలీసుల దాడుల్లో భారీగా రేషన్​ బియ్యం, గంజాయి, మద్యం పట్టివేత - Vigilance officials latest news

రాష్ట్రంలోని పలు జిల్లా విజిలెన్స్​, ఎస్​ఈబీ, పోలీసులు వేర్వేరుగా చేసిన దాడుల్లో భారీగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్​ బియ్యం, మద్యం, గంజాయి పట్టుబడ్డాయి. అక్రమ రవాణాలను నియంత్రించేందుకు అధికారులు తనిఖీలు చేస్తుండగా పలువురు పట్టుబడ్డారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న వాహనాలను సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Vigilance, SEB officials raids
విజిలెన్స్​, ఎస్​ఈబీ అధికారుల దాడులు
author img

By

Published : Jun 21, 2021, 11:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారావు అనే వ్యక్తి ఒక ఇంటి నుంచి 5226 కేజీల బియ్యం, వీరబాబు అనే వ్యక్తికి చెందిన 350 కేజీల బియ్యాన్ని సీజ్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి యానాంకు అక్రమంగా లారీలో తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకుని... వాహనాన్ని సీజ్​ చేశారు.

కర్నూలు జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనల్లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసుల అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లక్ష 68 వేల విలువ చేసే 14 బాక్సుల కర్ణాటక మద్యం, ఒక ద్విచక్రవాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలం పొనుగోటివారిపాలెం వద్ద రూ. 3 లక్షలు విలువ చేసే తెలంగాణ మద్యాన్ని సీజ్​ చేశారు.

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వెలువోలు గ్రామం సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన రెండు వేర్వేరు ప్రదేశాల్లో నాటు సారా స్థావరాలపై దాడులు దాడులు నిర్వహించినట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. రెండు ప్రదేశాల్లో చేసిన తనిఖీల్లో 30 లీటర్ల సారా సీజ్​ చేసి, 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. సారా తయారీదారులు, విక్రేతలపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై సందీప్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటను ద్వంసం చేసినట్లు ఎస్​ఈబీ అధికారులు చెప్పారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవుల వద్ద ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాని విలువ రూ. ఆరు లక్షలు ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి నలుగురు నిందితులను పట్టుకుని.. వారి వద్ద ఉన్న మూడు ద్విచక్రవాహనాలను సీజ్​ చేసినట్లు చెప్పారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రెండు వేర్వేరు కేసుల్లో 90 కేజీల గంజాయి పట్టుబడింది. ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కారు, ఆటో సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బమిడికలొద్దు క్వారీ తవ్వకాలకు.. సన్నాహాలు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.