ETV Bharat / city

Krishnashtami: ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - చంద్రబాబు

పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

Krishnashtami
Krishnashtami
author img

By

Published : Aug 30, 2021, 12:18 PM IST

అలౌకిక ఆనందానికి, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణుడు ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ప్రబోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమని.. మన సంస్కృతి, సంప్రదాయాలకు శ్రీకృష్ణతత్వం ప్రతీక అని వివరించారు. కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలి: సీఎం జగన్

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి జగన్ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా సీఎం జగన్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి షిమ్లాలో తన వివాహ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే ప్రజలకు శుభాకాంక్షలను తెలియచేశారు.

శ్రీకృష్ణుడి అవతారం ఆద్యంతం వ్యక్తిత్వ వికాస పాఠం వంటిది: చంద్రబాబు

ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. "శ్రీకృష్ణుడి అవతారం ఆద్యంతం వ్యక్తిత్వ వికాస పాఠం వంటిది. మనిషిలోని బలహీనతల్ని తొలగించి కార్యసాధనలో విజేతలను చేసే గీతోపదేశాన్ని ప్రపంచానికి అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు." అని ట్వీట్ చేశారు.

"బాల్యంలోని అల్లరి,అమాయకత్వం, తల్లిప్రేమలోని మాధుర్యం గుర్తుకు తెస్తూ కృష్ణుడి వేషధారణలో తిరిగే పిల్లలు... ఇలా కృష్ణాష్టమి అంటేనే ఒక సందడి. స్నేహ ధర్మం, రాజనీతి, నమ్మినవారికి అండగా నిలవడం, ధర్మాన్ని కాపాడటం వంటి కర్తవ్యాలకు మార్గదర్శనం చేసింది కూడా కృష్ణుడే. ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు." అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Afghan Taliban: టీవీ యాంకర్​ను లైవ్​లో గన్స్​తో బెదిరించిన తాలిబన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.