కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు యథావిథిగా కొనసాగుతున్నాయన్నారు. 2,500 ఆలయాల్లోని పేద అర్చకులకు రూ.5 వేల చొప్పున సహాయం చేశామన్న వెల్లంపల్లి.. 20 వేల అర్చకుల వివరాలు సేకరించినట్టు చెప్పారు. వారందరినీ ఆదుకుంటామని హామీఇచ్చారు.
ఫాదర్లు, ముస్లిం మతపెద్దలకూ రూ.5 వేలు ఇస్తున్నామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం చూసి బాధేస్తోందన్న ఆయన.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖలు రాయాల్సింది సీఎంకు కాదు... ప్రధాని మోదీకి అని చెప్పారు. కేంద్రానికి లేఖలు రాసి రాష్ట్రానికి ఆర్థికసాయం వచ్చేలా కన్నా చూడాలని చెప్పారు.
ఇదీ చదవండి: