వైకాపా ప్రభుత్వంలో కొంతమంది పోలీసు అధికారులు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. అధికార పార్టీకి పోలీసులు సాయం చేయాలనుకుంటే అది చట్టవ్యతిరేకంగా ఉండకూడదన్నారు. ఎదుటి వారికి నష్టం చేసేలా ఉండకూడదని హితవు పలికారు. ధర్మంగా వ్యవహరిస్తున్నారో లేదో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలని వర్ల రామయ్య కోరారు. కొందరు పోలీసుల తీరుపై ప్రైవేటు కేసులు వేయనున్నట్లు తెలిపారు. పోలీసు అధికారుల సంఘం వారి సమస్యలను పట్టించుకోకుండా తనపై విమర్శలు చేస్తోందని వర్ల ఆరోపించారు.
ఇదీ చదవండి : 'సుప్రీంతీర్పుపై వైకాపా ఏం సమాధానం చెబుతుంది?'