ETV Bharat / city

'అమరావతి రైతులపై కేసులు ఎత్తేయాలి'

అమరావతి రైతులపై పెట్టినవి అక్రమ కేసులని.. వాటిని ఎత్తేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రైతుల చేతులకు బేడీలు వేయడం దారుణమన్నారు.

varla ramaiyya on amaravathi farmers arrest
వర్ల రామయ్య
author img

By

Published : Oct 27, 2020, 8:01 PM IST

అమరావతి రైతుల చేతులకు బేడీలు వేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఖండించారు. కరుడుగట్టిన నేరస్థులకు మాత్రమే బేడీలు వేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తేసి.. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వ్యవహారశైలిపై పాలనా యంత్రాంగం పునరాలోచన చేయాలన్నారు. తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటనపై ముఖ్యమంత్రి జగన్, వైకాపా నేత విజయసాయిరెడ్డి ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. లోకేశ్ పై పెట్టిన కేసులన్నీ కక్ష సాధింపులో భాగమేనని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

'రైతులకు బేడీలా? ఇదేనా రైతు రాజ్యం?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.