అణగారిన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఇప్పుడు వారిపై దాడులు చేస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్ చెప్పేదొకటి చేసేదొకటని ఆయన మండిపడ్డారు. ఎస్సీలు ఓట్లు వేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా అన్న వర్ల.., ఆయనకు కొంచెం కూడా విశ్వాసం లేదని విమర్శించారు. ఎస్సీ యువకుడికి శిరోముండనం, ఎస్సీ బాలికపై అత్యాచారం జరిగితే చర్యలేందుకు తీసుకోలేదని మండిపడ్డారు.
మాస్కు పెట్టుకోలేదని ఓ ఎస్సీ యువకుడిని అన్యాయంగా చంపేశారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరోముండనానికి వైకాపా నేత కృష్ణమూర్తి కారణమని బాధితుడు వరప్రసాద్ తెలిపినా ప్రభుత్వం ఎందుకు కృష్ణమూర్తిని అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి తెదేపా నేతలను అరెస్టు చేయలేదా అని ఆరోపించారు.
ఇదీ చదవండి : రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు