ETV Bharat / city

'సీఎం మాయలో కొంతమంది పోలీసులు చిక్కుకున్నారు'

రాజధాని మహిళల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నందుకు ముఖ్యమంత్రి, హోం మంత్రి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. వైకాపా ర్యాలీలకు అనుమతిస్తున్న ప్రభుత్వం.. జేఏసీ ర్యాలీలకు ఎందుకు అనుమతివ్వడం లేదని నిలదీశారు.

'సీఎం మాయలో కొంతమంది పోలీసులు చిక్కుకున్నారు'
'సీఎం మాయలో కొంతమంది పోలీసులు చిక్కుకున్నారు'
author img

By

Published : Jan 12, 2020, 7:29 PM IST

ప్రభుత్వంపై వర్లరామయ్య విమర్శలు

రాష్ట్రంలో కొంత మంది పోలీసులు ముఖ్యమంత్రి మాయలో చిక్కుకున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. చంద్రబాబు డీజీపీని, పోలీసులను కించపరిచేలా మాట్లాడలేదని.. ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైకాపా ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతిస్తోన్న ప్రభుత్వం.. జేఏసీ ర్యాలీలకు ఎందుకు అనుమతినివ్వడం లేదని ప్రశ్నించారు. వైకాపా నాయకులకు ఒక చట్టం.. ప్రతిపక్షాలకు మరో చట్టమా అని వర్ల ప్రశ్నించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు సైతం రాజధాని గ్రామాల్లో పర్యటించలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. 144 సెక్షన్ వైకాపా నాయకులకు వర్తించదా అని నిలదీశారు. భక్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎస్వీబీసీలో.. రక్తి స్వామి పృథ్వీరాజ్​ను నియమించారని వర్ల రామయ్య విమర్శించారు.

ఇదీ చదవండి:

అమరావతి ఉద్యమంలో అపరిచితుడు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.