Vanama Raghava Suspended: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, తెరాస నేత వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తెరాస ప్రకటించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో రాఘవను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
రాఘవపై ఆరోపణలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో వనమా రాఘవ నిందితుడిగా ఉన్నారు. ఆయన వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.
ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో గురువారం బయటకు వచ్చింది. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో వనమా రాఘవపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
దీంతో పలు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. నేడు కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం బంద్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు తెరాస ప్రకటించింది.
Vanama Raghavendra Rao: ఎమ్మెల్యే తనయుడు.. వివాదాల రాఘవుడు.. అతడో కాలకేయుడు..