ETV Bharat / city

Bhadradri adhyayana utsavalu 2022: నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - తెలంగాణ వార్తలు

Bhadradri adhyayana utsavalu 2022 : నేటి నుంచి తెలంగాణలోని భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 23 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనం ఇస్తారు. నేడు మత్స్యావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు.

భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

author img

By

Published : Jan 3, 2022, 11:30 AM IST

Bhadradri adhyayana utsavalu 2022 : రాముడు నడయాడిన భూమిగా.. దక్షిణ అయోధ్యగా పేరొందింది తెలంగాణలోని భద్రాచలం పుణ్య క్షేత్రం. ఏటా ముక్కోటి ఏకాదశి వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి సహా సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పరిమిత సంఖ్యలో వీఐపీల మధ్య నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది వేలాది భక్తుల నడుమ అంగరంగవైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

వైభవంగా వేడుకలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23 వరకు వేడుకలు జరగనున్నాయి. నేటి నుంచి పది రోజులు పగలు పత్తు ఉత్సవాలు జరుగనున్నాయి. ఏకాదశిని కేంద్రంగా చేసుకొని తదుపరి పది రోజులు రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం విలాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పనులు పూర్తి చేశారు. భద్రాద్రి రామయ్య రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 12న గోదావరిలో లక్ష్మణ సమేత సీతారాములకు హంస వాహనంలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 13న ఏకాదశి రోజు రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలకు భద్రాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.

రోజుకొక అలంకారంలో రామయ్య

  • మొదటిరోజు- మత్స్య అవతారం
  • రెండో రోజు- కూర్మావతారం
  • మూడో రోజు- వరాహావతారం
  • నాలుగో రోజు- నరసింహ అవతారం
  • ఐదో రోజు- వామన అవతారం
  • ఆరో రోజు- పరశురామ అవతారం
  • ఏడో రోజు- శ్రీ రామ అవతారం
  • ఎనిమిదో రోజు- బలరామావతారం
  • తొమ్మిదో రోజు- శ్రీకృష్ణుని అవతారం

చకాచకా ఏర్పాట్లు

ఉత్తర ద్వారం, మిథిలా ప్రాంగణం వద్ద స్వామి వారిని వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నది వద్ద హంస వాహనాన్ని తయారు చేస్తున్నారు. భద్రాద్రికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కోసం స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకొక అవతారంలో దర్శనమిచ్చే స్వామి వారికి ప్రతిరోజు ఉదయం బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి మేళతాళాలు, కోలాట నృత్యాలు నడుమ తిరువీధి సేవకు వెళ్లి... మిథిలా ప్రాంగణంలోని భక్తులకు దర్శనమిస్తారు.

జనవరి 3 నుంచి ఈనెల 23 వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. రోజుకొక అవతారంలో స్వామివారిని అలంకరిస్తాం. నేడు మొదటి రోజు మత్స్య అవతారంలో శ్రీరామచంద్రుడు దర్శనం ఇస్తారు. రోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ముక్కోటి ఏకాదశిని వైభవోపేతంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి స్వామి భక్తులు తరలివస్తారు.

- స్థానాచార్యులు, ఆలయ స్థల సాయి

మంత్రి ఆదేశాలు

ఏడాదికి ఒకసారి మాత్రమే ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇచ్చే స్వామి వారిని దర్శించుకునేందుకు... తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మిథిలా ప్రాంగణానికి తరలి వస్తారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇప్పటికే జిల్లా అధికారులతో రవాణా శాఖ రెండుసార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి... వేడుకలను వైభవంగా నిర్వహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.

భద్రాద్రి క్షేత్రంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు నిర్వహిస్తారు. స్వామివారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

-పొడిచేటి జగన్నాథాచార్యులు. విశ్రాంత ప్రధానార్చకులు

ఇదీ చదవండి:

ఇంట్లో గ్యాస్ లీక్.. కుమార్తె సహా దంపతులు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.