గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 20 వేల మంది సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించి వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రతిరోజూ దాదాపు 23 లక్షల కూలీలకు పని కల్పిస్తున్నారని ఆయన వివరించారు. ఎఫ్ఏ, టీఏ, సీఈ, ఈసీ, ఏపీవో, ఏపీడీ, డ్వామా పీడీలకు ప్రథమ ప్రాధాన్యతగా వ్యాక్సిన్ ఇవ్వాలని మంత్రి కోరారు. ఉపాధి హామీ సిబ్బంది వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉపాధి హామీ సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని 13 జిల్లాల కలెక్టర్లకు మంత్రి సిఫార్సు చేశారు.
ఇదీ చదవండీ... 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'