కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ కోసం అంతర్జాతీయంగా వైద్య పరిశోధనలు శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే సంక్రమించిన రోగుల్లో వీలైనంత త్వరగా మహమ్మారిని నయం చేసే ప్రత్యామ్నాయాలపైనా నిపుణులు దృష్టి సారించారు. ఈ క్రమంలో క్వారంటైన్లో ఉన్నవారికి స్టెరాయిడ్స్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజీషియన్స్ ఆరిజన్-ఆపి తరఫున నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై టెక్సాస్‌లో భారత వైద్యుల పరిశోధనల్లో సత్ఫలితాలు వస్తున్నట్లు కొవిడ్ 19 టాస్క్ ఫోర్స్ కమిటీ కో-ఛైర్మన్ డాక్టర్ లోకేశ్ ఈదర తెలిపారు.
ఇదీ చదవండి: 'సృష్టి' కేసు.. బిడ్డ చనిపోయిందని నమ్మించి అమ్మేశారు: సీపీ ఆర్కే మీనా