ETV Bharat / city

లక్ష్యానికి మించి ఉపాధి హామీ పనిదినాలు - ఏపీ తాజా వార్తలు

ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది లక్ష్యానికి మించి పని దినాలు ఉపయోగించుకున్నారు. బుధవారంతో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పలు విడతల్లో మొత్తం 25.25 కోట్ల పని దినాలు కేటాయించింది. వీటిలో సోమవారంనాటికి 25.42 కోట్ల పని దినాలు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

upadi hami pathakam
ఉపాధి హామీ పథకం
author img

By

Published : Mar 30, 2021, 8:41 AM IST

ఉపాధి హామీ పథకం (నరేగా)లో ఈ ఏడాది లక్ష్యానికి మించి పని దినాలు ఉపయోగించుకున్నారు. రాష్ట్రేతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారిలో అత్యధికులు కొవిడ్‌తో తిరిగి స్వగ్రామాలకు వచ్చారు. వీరందరికీ అప్పటికప్పుడు కొత్తగా ఉపాధి కార్డులనిచ్చి ఉపాధి కల్పించడంతో అత్యధికంగా పని దినాలు ఖర్చయ్యాయని అధికారులు చెబుతున్నారు. బుధవారంతో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పలు విడతల్లో మొత్తం 25.25 కోట్ల పని దినాలు కేటాయించింది. వీటిలో సోమవారంనాటికి 25.42 కోట్ల పని దినాలు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మంగళ, బుధవారాల్లో మరో 5లక్షలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా 20 కోట్ల నుంచి 23 కోట్ల మధ్య రాష్ట్రంలో పని దినాలు వినియోగిస్తుంటారు. గతేడాది (2019-20) 20.25 కోట్ల పని దినాల్లో 20.02 కోట్లే ఉపయోగించుకున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన పేదలు కొవిడ్‌తో వెనక్కి రావడంతో ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో లక్ష్యానికి మించి 10 నుంచి 15 శాతం పని దినాలు వినియోగించారు. ఏప్రిల్‌లో మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం (2021-22)లో 30 కోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను సమీక్షించి పని దినాలు కేటాయిస్తుంది. మొదటి విడతగా రాష్ట్రానికి 20 కోట్ల పని దినాలు కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అధికారికంగా ఉత్తర్వులనివ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఏప్రిల్‌ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.