రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు తిరుమల రానున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్రపతి బస చేసే పద్మావతి అతిథి గృహం, వరాహస్వామివారి ఆలయం, శ్రీవారి ఆలయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
కొవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తూ దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కనుమదారుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు... డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రపతి పర్యటనను పర్యవేక్షించే ప్రత్యేకాధికారులు కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు.
ఇదీ చదవండి
భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు