ETV Bharat / city

attack on posani house: పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి

author img

By

Published : Sep 30, 2021, 12:31 PM IST

సినీనటుడు పోసాని ఇంటిపై బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు(attack on posani house). ఘటనలో పోసాని ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

posani krishna murali
posani krishna murali
attack on posani house: పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి

సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు(attack on posani house). హైదరాబాద్​లోని ఎస్​ఆర్​నగర్​ ఠాణా పరిధి ఎల్లారెడ్డిగూడెంలోని ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు(unknown persons attack on posani home ). ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అసభ్యపదజాలంతో దూషిస్తూ.. ఇంటి గేటుపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఇంటి వాచ్​మెన్​ యాకయ్య తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ గొడవ

చలన చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని... పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు(disputes bet ween Pavan kalyan posani) . పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్​కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని.... అభిమానులను పవన్ నియంత్రణలో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రెస్​మీట్​ తర్వాత దాడికి యత్నం

తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్​పై (Pawan Kalyan) పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) దాడి అనంతరం తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అభిమానుల దాడిలో తాను చనిపోతే పవన్ కల్యాణే కారణమని పేర్కొన్న పోసాని... ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి (Pawan fans attempt to attack on Posani) యత్నించారు. అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోసానిని సురక్షితంగా పోలీసు వాహనంలో ఆయన నివాసానికి తరలించారు.

ఇదీ చూడండి: Posani to pk: 'ముందు ఆ పంజాబ్ అమ్మాయికి న్యాయం చేయాలి పవన్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.